Minister Rama Naidu : బుడమేరు ఆక్రమణలపై చర్యలు తప్పవు

ఈ ఆక్రమణల్లో చాలా వరకూ అగ్రికల్చర్ కోసం జరిగినవేనని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు...

Minister Rama Naidu : బుడమేరు అక్రమణలపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు ప్రహహించే చుట్టుపక్కల ప్రాంతాల్లో 3051 ఆక్రమ నిర్మాణాలు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చాలా వరకూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. ఈరోజు ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Rama Naidu) మాట్లాడుతూ… వెలగలేరు హెడ్ రెగ్యూలేటర్ నుంచి ఓల్డ్ ఛానల్ వైపు బుడమేరు వెళ్తుందని అన్నారు. ఇది వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరిపాడు, గొల్లపూడి, విద్యాధరపురం, విజయవాడ 14, 15, 16 రెవెన్యూ వార్డులు, గుణదల, రామవరపాడు, ప్రసాదంపాడు మీదుగా ఎనికేపాడు వరకు మొతం 36.2 కిలో మీటర్ల వార్డులు ఉన్నాయని చెప్పారు. అలాగే కొన్ని గ్రామాల్లో కూడా బుడమేరు ఆక్రమణలు ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Minister Rama Naidu Comment

ఈ ఆక్రమణల్లో చాలా వరకూ అగ్రికల్చర్ కోసం జరిగినవేనని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వీఎంసీ పరిధిలో 202 ఎకరాల్లో 70 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని అన్నారు. బుడమేరు విస్తారణ నేపథ్యంలో ఎంతమేరకు ఆక్రమణలు జరిగాయనేది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. చీమల వాగు, కేసరపల్లి, ఎనికేపాడు యూటీల సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకూ గండ్లను పూడ్చాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. బుడమేరు ఓల్డ్ ఛానల్ విజయవాడ నగరం మధ్య నుంచి వస్తోందని అన్నారు. దీనికి సమాంతరంగా ఉన్న కెనాల్‌ను విస్తరించడం ద్వారా బుడమేరు ప్లడ్ వాటర్‌ను డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. పాములు కాలవ, ముస్తాబాద్ కెనాళ్ల పరిధి పెంచుతామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Also Read : Minister Parthasarathy : ఏపీలో ‘హైడ్రా’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!