RK Roja : చంద్ర‌బాబు విజ‌న్ బ‌క్వాస్ – ఆర్కే రోజా

షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి

RK Roja : ఏపీ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం రోజా మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ప్ర‌తిసారీ బాబు విజ‌న్ అంటూ ఊద‌ర‌గొడ‌తార‌ని కానీ ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు ఆర్కే రోజా.

ఏపీ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్ప‌మంటే ఒక్క మాట కూడా మాట్లాడ‌డంటూ ఎద్దేవా చేశారు. ఆయ‌న వ‌ద్ద ఏం ఉంద‌ని చెపుతాడంటూ సెటైర్ వేశారు ఏపీ మంత్రి. తండ్రీ కొడుకులు ఎన్ని మాయ మాట‌లు చెప్పినా జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.

ప్ర‌తిప‌క్షాలు ఒక్క‌టైనా సింహం లాంటి వైఎస్ జ‌గ‌న్ ద‌రి దాపుల్లోకి రాలేన్నారు ఆర్కే రోజా(RK Roja). రాబోయే ఎన్నిక‌ల్లో మ‌రోసారి భారీ ఎత్తున సీట్ల‌ను గెలుచుకుంటామ‌ని తిరిగి రెండోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని జోష్యం చెప్పారు మంత్రి ఆర్కే రోజా.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌న్నారు. ఇందులో పేద‌లు, నిరుపేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ల‌బ్ది చేకూరుతోంద‌న్నారు. ఇవాళ స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన నాడు నేడు కార్య‌క్ర‌మం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. అబ‌ద్దాలు, మోసాలు త‌ప్ప చంద్ర‌బాబుకు ఇంకేమీ రాద‌న్నారు. జ‌నం ఛీ కొట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు ఆర్కే రోజా.

Also Read : Sapthagiri Salaar : స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం – స‌ప్త‌గిరి

Leave A Reply

Your Email Id will not be published!