Senthill Balaji Annamalai : అన్నామ‌లైపై సెంథిల్ సీరియ‌స్

డీఎంకే మంత్రి బాలాజీ సీరియ‌స్

Senthill Balaji Annamalai : డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ అన్నామ‌లై పై నిప్పులు చెరిగారు. నాలుగు మేక‌లు క‌లిగి ఉన్నానంటూ ప‌దే ప‌దే చెప్పే అన్నామ‌లైకి రూ. 5 ల‌క్ష‌ల విలువైన వాచ్ ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా బీజేపీ చీఫ్ బెల్ అండ్ రాస్ లిమిటెడ్ ఎడిష‌న్ ర‌ఫేల్ వాచ్ పై మంత్రి ప్ర‌స్తావించారు.

ఈ గ‌డియారం కొనుగోలుకు సంబంధించి ర‌శీదును అన్నామలై చూప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు సెంథిల్ బాలాజీ(Senthill Balaji). ద‌సాల్ యుద్ద విమానాల త‌యారీని సెల‌బ్రేట్ చేసుకునేందుకు కంపెనీ తయారు చేసిన బెల్ అండ్ రాస్ ర‌ఫేల్ లిమిటెడ్ ఎడిష‌న్ వాచ్ ను అన్నామ‌లై ధ‌రించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామ‌లై స్పందించారు. మంత్రి సెంథిల్ బాలాజీ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. ఇది క‌లెక్ట‌ర్స్ ఎడిష‌న్ అని ఈ వాచ్ తాను తుది శ్వాస విడిచే వ‌రకు త‌న‌తో ఉంటుంద‌న్నారు అన్నామ‌లై. వాచ్ ను కొనుగోలు చేయ‌డంలో త‌ప్పేముంద‌న్నారు.

అయితే ర‌ఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించి ఈ గ‌డియారాన్ని త‌యారు చేశార‌ని చెప్పారు అన్నామ‌లై. కంపెనీ త‌యారు చేసిన 500 వాచ్ ల‌లో తాను 149వ దానిని ధ‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ప్ర‌స్తుతం రాఫెల్ కు సంబంధించి పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆ మ‌ధ్య‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం సెంథిల్ బాలాజీ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

Also Read : అభివృద్ది నినాదం అదే మా ల‌క్ష్యం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!