V Srinivas Goud : సాహిత్యం తెలంగాణ సంప‌దత్వం

మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ కామెంట్స్

V Srinivas Goud : నా తెలంగాణ కోటి ర‌త‌ణాల వీణ అని నిన‌దించిన దిగ్గ‌జ క‌వి దాశ‌ర‌థి న‌డ‌యాడిన నేల తెలంగాణ గొప్ప‌ద‌న్నారు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి విర‌సనోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్(V Srinivas Goud). సాహిత్య‌, సాంస్కృతిక‌, రాజ‌కీయ రంగాల‌లో చైత‌న్య‌వంతమైన ప్రాంతం ఇదేన‌ని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 9 ఏళ్లు పూర్తి చేసుకుంది భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వం. ఈ మేర‌కు ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది గ‌త కొన్ని రోజుల నుంచి. జూన్ 11న ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని సాంస్కృతిక శాఖ , సాహిత్య అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

హైద‌రాబాద్ లోని ర‌వీంద్ర భార‌తిలో తెలంగాణ సాహిత్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బ‌హు భాషా క‌వి స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దీనిని రాష్ట్ర హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ తో క‌లిసి మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ ప్రారంభించారు. జిల్లా, రాష్ట్ర స్థాయి క‌వి స‌మ్మేళ‌నాల‌ను నిర్వ‌హించారు. ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన క‌వుల‌ను స‌న్మానించి, పుర‌స్కారాల‌ను అంద‌జేశారు మంత్రి.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరేటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్యా, మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపిక రెడ్డి, అధికార భాష సంఘం చైర్మన్ శ్రీదేవి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

Also Read : DK Shiva Kumar Visit : ఉజ్జ‌యిని ఆల‌యంలో డీకే పూజ‌లు

Leave A Reply

Your Email Id will not be published!