Miniter KTR : ఎన్టీఆర్ పేరు ఉండటం అదృష్టం – కేటీఆర్
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కామెంట్స్
Miniter KTR : ఖమ్మం జిల్లా – ఐటీ, పురపాలిక , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎక్కువగా నగరంలో ఆంధ్ర ప్రాంత వాసులు ఉన్నారు. వారి ఓట్లు రావాలంటే తప్పక వారికి సంతోషం కలిగించేలా ఏదో ఒక ప్రకటన చేయాలి. ప్రస్తుతం కేటీఆర్ రూటు మార్చారు. తన స్వరం మరింత పెంచారు. ఏకంగా ప్రముఖ నటుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావును ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనను ఆకాశానికి ఎత్తేశారు.
Miniter KTR Praises NTR
దక్షిణ భారత దేశంలో ఇప్పటి దాకా హ్యాట్రిక్ సీఎం రికార్డును ఎవరూ సాధించ లేదన్నారు. కానీ తన తండ్రి, దమ్మున్న లీడర్ గా పేరు పొందిన , ఉద్యమ నాయకుడు, తెలంగాణ రథ సారథి కేసీఆర్ సాధించ బోతున్నారని జోష్యం చెప్పారు.
ఆనాడు ప్రజా పాలకుడిగా పేరు పొందిన ఎన్టీఆర్ కు కూడా సాధ్యం కాలేదన్నారు. కానీ నా తండ్రికి సాధ్యం అవుతుందని అన్నారు కేటీఆర్(Miniter KTR). ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆప్తుడు, ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని స్పష్టం చేశారు.
రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు సైతం ఎలా ఉంటాడో ఎవరూ చూడలేదన్నారు. కానీ రాముడైనా, కృష్ణుడైనా ఇంకే దేవుడైనా ఎన్టీయారేనంటూ కొనియాడారు కేటీఆర్. చరిత్రలో మహనీయుల స్థానం అజరామరమని , అందులో ఎన్టీఆర్ స్థానం పదిలంగా ఉంటుందన్నారు. ఆయన పేరు తనకు ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
Also Read : BRS Win : తెలంగాణలో మళ్లీ గులాబీదే జెండా
I wanted to thank you for this excellent read!! I definitely enjoyed every bit of it. I have you saved as a favorite to look at new stuff you post…