Ashish Mishra : మిశ్రా బెయిల్ ర‌ద్దు చేయాలంటూ పిటిష‌న్

సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన రైత‌న్న‌లు

Ashish Mishra : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన యూపీలోని ల‌ఖీంపూర్ ఖేరి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి త‌న‌యుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది అలహాబాద్ హైకోర్టు.

దీనిపై రైతు సంఘం నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ , కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు ప్రియాంక గాంధీ, ఆర్ఎల్డీ చీఫ్ జ‌యంత్ చౌద‌రి తీవ్ర అభ్యంత‌రం చెప్పారు.

ప్ర‌త్యేకించి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆశిష్ మిశ్రాను(Ashish Mishra) విడుద‌ల చేయ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఈనెల 15న విడుద‌లైన ఆశిష్ మిశ్రా ప్ర‌స్తుతం ద‌ర్జాగా తిరుగుతున్నాడు.

సాగు చ‌ట్టాలను నిర‌సిస్తూ ఉద్య‌మించిన రైత‌న్న‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆశిష్ మిశ్రా బెయిల్ ను స‌వాల్ చేస్తూ రైతు కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించాయి.

రైతుల‌ను త‌న వాహ‌నంతో తొక్కించిన‌ట్లు బ‌ల‌మైన సాక్ష్యాలు ఉన్న‌ప్ప‌టికీ నిందితుడు బెయిల్ పై రిలీజ్ కావ‌డాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు.

వారి త‌ర‌పున ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ ద్వారా భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశాయి.

అత‌డిలో ఉన్న హేయ‌మైన నేర స్వ‌భావాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందంటూ అభ్యంత‌రం తెలిపాయి.

ఛార్జిషీట్ లో నిందితుడికి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన స‌క్ష్యాలు ఉన్నాయ‌ని ఇందులో పెర్కొన్నారు. నిందితుడు మ‌రోసారి ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డే ఛాన్స్ ఉంద‌ని ఆరోపించారు.

అంతే కాదు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాల్ని తారు మారు చేసే అవ‌కాశం ఉంద‌ని రైతులు ఆరోపించారు.

Also Read : అమిత్ చంద్ర షా సంచ‌ల‌న కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!