Mission Impossible7 : మిష‌న్ ఇంపాజిబుల్ 7 ట్రైల‌ర్ సూప‌ర్

మ‌రోసారి మెరిపించిన టామ్ క్రూజ్

Mission Impossible7 : వ‌ర‌ల్డ్ మోస్ట్ పాపుల‌ర్ హీరోలలో టాప్ లో ఉన్న ఏకైక న‌టుడు టామ్ క్రూజ్. ఈ న‌టుడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. భిన్న‌మైన పాత్ర‌ల్లో ఒదిగి పోవ‌డం, ఆపై అంద‌రినీ విస్తు పోయేలా చేయ‌డం టామ్ క్రూజ్ ప్ర‌త్యేక‌త‌.

అందుకే కోట్లాది మంది అభిమానుల మ‌న‌సు దోచుకున్నాడు. తాజాగా టామ్ క్రూజ్ న‌టించిన, ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ భ‌రితంగా ఎదురు చూసిన మిష‌న్ ఇంపాజిబుల్ 7(Mission Impossible7) ట్రైల‌ర్ రానే వ‌చ్చింది.

విడుద‌లైన కొద్ది సెక‌న్ల‌లోనే సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ మూవీ ట్రైల‌ర్. టామ్ క్రూజ్ ఇందులో ఏతాన్ హంట్ గా తిరిగి వ‌చ్చాడు. ఇంపాజిబుల్ డెడ్ రిక‌ర‌నింగ్ పార్ట్ -1 జూలై 14 , 2023న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

ఇప్ప‌టికే ది మిష‌న్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీకి ఎలాంటి ప‌రిచయం అక్క‌ర్లేదు. టామ్ క్రూజ్ అమెరికన్ ఏజెంట్ పాత్ర‌లో తిరిగి వ‌చ్చాడు. ఇందులో చెడుతో పోరాడుతూ మంచి కోసం మ‌ర‌ణాన్ని ధిక్క‌రిస్తూ ప్ర‌పంచమంత‌టా ప‌ర్య‌టిస్తాడు.

తాజా ఇన్ స్టాల్ మెంట్ లో కూడా హంట్ కొత్త గా విస్మ‌య ప‌రిచే విన్యాసాలు, ఆయుధాలు, కార్లు, వెనిస్, వాటిక‌న్ వంటి స్థానాల‌ను విల‌న్ల‌తో తీసుకునేందుకు సిద్దంగా ఉంది.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే యూజీన్ కిట్రిడ్జ్ స‌న్నివేశంతో ప్రారంభం అవుతుంది. ఈ పాత్ర‌ను హెన్రీ క్థేర్నీ పోషించాడు. కేవ‌లం రెండు నిమిషాల ట్రైల‌ర్ లో అద్భుత‌మైన డైలాగ్ మాత్ర‌మే జోడించారు ద‌ర్శ‌కుడు.

ట్రైల‌ర్ లో సైమ‌న్ పెగ్ , వెనెస్సా కిర్బీ, వింగ్ రేమ్స్ , రెంబెక్కా పెర్గుసన్ పున‌రావృత పాత్ర‌లు మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి.

Also Read : చాయ్ కి మ‌హేష్ బాబు ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!