Mitchell Pat Commins : మిచెల్..ప్యాట్ కమిన్స్ వైరల్
Mitchell Pat Commins : దుబాయ్ – బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ వేలం పాట ముగిసింది. మొత్తం 332 సభ్యులకు గాను 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 10 జట్లకు చెందిన ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొన్నాయి. ఏకంగా రూ. 267 కోట్లు ఖర్చు చేశాయి. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డ్ కానుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భారీ ధరకు అమ్ముడు పోయారు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు.
Mitchell Pat Commins Viral
ఇక భారత జట్టు తరపున హర్షల్ పటేల్ రూ. 11.75 కోట్లకు అమ్ముడు పోయాడు. క్రికెటర్ ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చేజిక్కించుకుంది. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో క్రికెట్ ప్రపంచం విస్తు పోయింది. ఆసిస్ స్టార్ ప్లేయర్లు మిచెల్(Mitchell) తో పాటు ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించారు.
ఏకంగా కోల్ కతా నైట్ రైడర్స్ పోటీ పడి చేజిక్కించుకుంది భారీ ధరకు మిచెల్ . విచిత్రంగా కేకేఆర్ యాజమాన్యం రూ. 24.75 కోట్లకు కైవసం చేసుకుంది. ఇదే సమయంలో ఆసిస్ స్కిప్పర్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు చేజిక్కించుకుంది. ఎస్ ఆర్ హెచ్ సిఇవో కావ్య మారన్ సంచలన నిర్ణయం తీసుకోవడం విస్తు పోయేలా చేసింది.
ప్రస్తుతం మిచెల్ , ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం భారీ ధరకు అమ్ముడు పోవడంతో సంచలనంగా మారారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
Also Read : IPL Auction Comment : వేలానికి ఫిదా ధర వారెవ్వా