IPL Auction Comment : వేలానికి ఫిదా ధ‌ర వారెవ్వా

మిచెల్ సెన్సేష‌న్ రూ. 24.75 కోట్లు

IPL Auction Comment : ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రించారు కార్పొరేట్ యాజ‌మాన్యాలు. కేవ‌లం ఒకే ఒక్క‌డి మీద ఏకంగా రూ. 24. 75 కోట్లు వెచ్చించ‌డం యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. ప్ర‌తి ఏటా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సార‌థ్యంలో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (IPL) ఫార్మాట్ లో మెగా టోర్నీ నిర్వ‌హించ‌డం ప‌రిపాటి. ఇందులో భాగంగా వేయి మందికి పైగా ఇండియాతో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన ఆట‌గాళ్లు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. ఇందులో వ‌డ పోత పోసి చివ‌ర‌కు 332 మందిని ఎంపిక చేసింది బీసీసీఐ. ప్ర‌తిసారి ఇండియాలోనే ఐపీఎల్ వేలం పాట జ‌రిగేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా దుబాయ్ వేదిక‌గా మినీ వేలం పాట జ‌రిగింది. బేస్ ధ‌ర నుంచి అత్య‌ధిక ధ‌ర వ‌ర‌కు ఆటగాళ్లు ప‌లికారు. మొత్తం ఐపీఎల్ లో పాల్గొనే 10 జ‌ట్ల‌కు సంబంధించిన యాజ‌మాన్యాలు ఇక్క‌డ కొలువు తీరాయి.

IPL Auction Comment Viral

విచిత్రం ఏమిటంటే ఈసారి బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఎగ‌రేసుకు పోయిన ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల పంట పండింది. ప్ర‌ధానంగా కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ కు ఊహించ‌ని ధ‌ర ల‌భించింది. ఈ వేలం పాట‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పోటీ ప‌డి అత‌డిని చేజిక్కించుకుంది. అందాల ముద్దుగుమ్మ ఎస్ ఆర్ హెచ్ సిఇవో కావ్య మార‌న్ ఇత‌ర ఫ్రాంచైజీల‌కు షాక్ ఇస్తూ ఏకంగా రూ. 20.50 కోట్లు వెచ్చింది. క‌మిన్స్ ను కొనుగోలు చేసింది. దీంతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో , దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. విచిత్రం ఏమిటంటే ఇప్ప‌టి దాకా ఐపీఎల్ చ‌రిత్ర‌లో భారీ స్థాయిలో ధ‌ర ప‌ల‌క‌డం ఎప్పుడూ చూడ‌లేదు. ఓ వైపు క‌మిన్స్ ను ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసిన ఆనందం ఆవిరి అయ్యేలా చేశారు ప్ర‌ముఖ దిగ్గ‌జ బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ గా పేరు పొందిన మిచెల్ ను ఏకంగా రూ. 24.75 కోట్ల‌కు చేజిక్కించుంది.

చివ‌రి దాకా అత‌డిని ద‌క్కించు కునేందుకు గుజ‌రాత్ టైటాన్స్ పోటీ ప‌డింది. కానీ ఊహించ‌ని ధ‌ర‌ను ఆఫ‌ర్ చేసింది కేకేఆర్. ఇప్పుడు ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు క‌మిన్స్ , మిచెల్ లు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తున్నారు. ఎంతో మంది ప్లేయ‌ర్లు వేలం పాట‌లోకి వ‌చ్చినా కేవ‌లం 77 మందినే కొనుగోలు చేశాయి ప్రాంచైజీలు. మొత్తం రూ. 262 కోట్లు వెచ్చించాయి. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే హ‌ర్ష‌ల్ ప‌టేల్ అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఆట‌గాడిగా నిలిచాడు. రూ. 11 కోట్ల‌కు పైగా వెచ్చించి ద‌క్కించుకుంది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్. ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఏకంగా విండీస్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ పావెల్ ను రూ. 7.40 కోట్లకు తీసుకుంది. మొత్తంగా ఐపీఎల్(IPL) చ‌రిత్ర‌లో ఈ వేలం పాట చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే ఒక ఆట‌గాడికి రూ. 24 కోట్ల‌కు పైగా వెచ్చించ‌డం విస్తు పోయేలా చేసింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్నగా మిగిలి పోయింది.

Also Read : Dawood Ibrahim Comment : దావూద్ ఉన్న‌ట్టా లేన‌ట్టా

Leave A Reply

Your Email Id will not be published!