Dawood Ibrahim Comment : దావూద్ ఉన్న‌ట్టా లేన‌ట్టా

విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని ప్ర‌చారం

Dawood Ibrahim : ప్ర‌పంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ గా పేరు పొందిన దావూద్ ఇబ్ర‌హీంపై(Dawood Ibrahim) విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని, ప్ర‌స్తుతం చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టు మిట్టాడుతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజమో అబ‌ద్ద‌మో ఇంకా తెలియ‌దు. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ గా గుర్తింపు పొందాడు. భార‌త దేశం అత‌డిని ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటుంది. దీనికి కార‌ణం దావూద్ పేరు ఎత్తితే చాలు ముంబై మార‌ణ హోమం గుర్తుకు వ‌స్తుంది. దీని వెనుక ప్రధాన హ‌స్తం ఉన్న‌ది ఈ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డానే.

త‌న‌కంటూ గ్యాంగ్ ల‌ను ఏర్పాటు చేసుకుని వ‌ర‌ల్డ్ వైడ్ గా దందాలు, సెటిల్మెంట్స్ చేసుకుంటూ పోయాడు. లెక్క‌కు మించిన ఆస్తుల‌ను, డ‌బ్బులను సంపాదించాడు. ఆపై త‌న‌కు అడ్డు వ‌చ్చిన వారిని అడ్డంగా తొల‌గించుకుంటూ పోయాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే క‌నిపించ‌ని క్రిమిన‌ల్ . కానీ ఎప్పుడైతే మోదీ ప్ర‌ధానిగా కొలువు తీరాడో ఆనాటి నుంచి దావూద్ లో భ‌యం మొద‌లైంది. అంతే కాదు ఎక్కువ‌గా అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ ఆందోళ‌న‌కు గురైంది మాత్రం ఈ దేశానికి భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా నియ‌మితులైన అజిత్ దోవ‌ల్ గురించి.

Dawood Ibrahim Comment Viral

త‌ను ఎప్పుడైతే బాధ్య‌త‌లు స్వీక‌రించాడో ఆనాటి నుంచి త‌ను పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఒక ర‌కంగా ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క స‌తమ‌తం అయ్యాడు. నిన్న‌టి దాకా భార‌త్ లో పాక్ ప్రేరేపిత శ‌క్తులు దాడులకు దిగేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. పాకిస్తాన్(Pakistan) లో దాడులు కొన‌సాగుతున్నాయి. అవి ఎవ‌రు చేస్తున్నారో తెలుసు కోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది ఆ దేశ ఆర్మీ చీఫ్ కు.

సాధ్య‌మైనంత వ‌ర‌కు దోవెల్ తో అంటీ ముట్ట‌న‌ట్టుగా ఉండ‌డ‌మో లేక స్నేహానికి ఆహ్వానం ప‌ల‌క‌డ‌మో చేయాలని డిసైడ్ అయ్యారు. భార‌త్ తో ఆఫ్గ‌నిస్తాన్ స‌ఖ్య‌త‌తో ఉండ‌డం కూడా మింగుడు ప‌డ‌డం లేదు పాక్ కు. ఇదే స‌మ‌యంలో టెర్ర‌రిస్టుల‌కు కంటి మీద కునుకే లేకుండా పోయింది. ప‌దే ప‌దే దాడుల‌కు తెగ‌బ‌డినా ఎక్క‌డా త‌గ్గే ప్ర‌స‌క్తి లేదంటూ ప్ర‌కటించారు అజిత్ దోవ‌ల్.ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి బాంబు లాంటి వార్త గుప్పుమంది. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంపై విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని, ఆయ‌న‌కు క‌రాచీలో చికిత్స అందిస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించింది. సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్ గా మారింది.

67 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన దావూద్ ఇబ్ర‌హీం త‌న నేర సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా ఆక్టోప‌స్ కంటే వేగంగా విస్త‌రించుకుంటూ పోయాడు. ప్ర‌స్తుతం పాకిస్తాన్ లో ఆశ్ర‌యం పొందుతున్నాడు. ఒక సాధార‌ణ కానిస్టేబుల్ కుటుంబంలో మ‌హారాష్ట్ర లోని ర‌త్న‌గిరిలో పుట్టాడు. 1974లో డాన్ గా కొన‌సాగుతున్న ప‌ఠాన్ బాషు మీద దాడి చేశాడు. ఆపై అప్ప‌టికే టాప్ లో కొన‌సాగుతున్న హాజి మ‌స్తాన్ , వ‌ర‌ద రాజ‌న్ మొద‌లియార్, క‌రీం లాలా వంటి డాన్ ల‌ను నెట్టేసి ముందుకు వ‌చ్చాడు . 1950 త‌ర్వాత కేవ‌లం క‌త్తి పోట్ల‌కే ప‌రిమిత‌మైన ముంబై మాఫియాను ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి తీసుకు వెళ్లాడు దావూద్ ఇబ్ర‌హీం. 1976లో డి – కంపెనీ ఏర్పాటు చేశాడు. సినిమాల‌కు కూడా పెట్టుబ‌డి పెట్టే స్థాయికి ఎదిగాడు. ఒకానొక స‌మ‌యంలో త‌ను శాసించాడు.

న‌టి మందాకినితో సంబంధం పెట్టుకున్నాడు. 1993లో వ‌రుస పేలుళ్ల‌కు త‌నే బాధ్యుడు. 250 మందికి మృతికి కార‌కుడు త‌నేనంటూ కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దీంతో దేశాన్ని వ‌దిలి పెట్టి పాకిస్తాన్ కు ప‌రార‌య్యాడు. అల్ కాయిదా, ల‌ష్క‌రే తోయిబా త‌దిత‌ర సంస్థ‌ల‌తో క‌లిసి ప్లాన్ చేశాడు. లాడెన్ తో దావూద్ కు సంబంధం ఉందంటూ యుఎస్ ఆరోపించింది. క‌రాచీలోనే ఉన్నాడంటూ ఇండియా ఆరోపించింది. ద‌క్షిణాసియా వ్యాప్తంగా డి కంపెనీని విస్త‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజాగా దావూద్ పై విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని , బ‌తికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఏది ఏమైనా మార‌ణ హోమానికి కార‌కుడైన అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ ఉన్న‌ట్టా లేన‌ట్టా అనేది త్వ‌ర‌లోనే తేలుతుంది.

Also Read : Smriti Irani Comment : నెలసరిపై నిందలు వేస్తే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!