Shabaash Mithu Movie : మిథాలీ రాజ్ ‘శభాష్ మిథు’ మెస్మరైజ్
జూలై 15న విడుదలకు రెడీ
Shabaash Mithu Movie : ప్రపంచ మహిళా క్రికెట్ లో ఓ శకం ముగిసింది. దిగ్గజ క్రికెటర్ హైదరాబాద్ కు చెందిన మిథాలీ రాజ్ ఇక సెలవంటూ ప్రకటించింది. 1999లో ప్రారంభమైన ఆమె కెరీర్ 2022తో ముగిసింది.
టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్ లలో ఏకంగా 10,000లకు పైగా పరుగులు సాధించి అరుదైన ఘనత సాధించింది. ఆమె సాధించిన ప్రస్థానం వెల కట్ట లేనిది.
ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు భరించి విజేతగా నిలిచింది మిథాలీ రాజ్. తన క్రికెట్ కెరీర్ లో 23 ఏళ్ల పాటు కొనసాగింది. మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా శభాష్ మిథు(Shabaash Mithu Movie) పేరుతో మూవీ రూపొందించారు.
ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ప్రియా అవెన్ రాశారు. ప్రముఖ నటి తాప్సీ పన్ను మిథాలీ రాజ్ పాత్రలో నటించారు. సిర్షా రే సినిమాటోగ్రఫీ అందించారు.
ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తే అమిత్ త్రివేది సంగీతం అందించారు. ప్రముఖ దిగ్గజ కంపెనీ రిలయన్స్ కంపెనీకి చెందిన వయా కామ్ 18 స్టూడియోస్ , కొలోస్పియా మీడియా సంయుక్తంగా శభాష్ మిథు మూవీని నిర్మించాయి.
వచ్చే నెల జూలై 15న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన టీజర్స్ , ట్రైలర్ కు భారీ ఆదరణ లభించింది.
భారతీయ హిందీ భాషా జీవిత చరిత్రగా రూపొందించారు సినిమాను. ఈ చిత్రంలో మిథాలీ రాజ్ జీవితంలోని హెచ్చు తగ్గుల్ని , కీర్తి శిఖరాలను తెర మీద ఎక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
Also Read : మహిళా క్రికెట్ లోకంలో ఓ దృవతార