MK Stalin : తమిళ భాషను జాతీయ భాషగా గుర్తించాలి
మా హక్కుల్ని ఒదులుకోం యుద్దానికి సిద్దం
MK Stalin : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బిగ్ షాక్ ఇచ్చారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భాష పేరుతో రాజకీయం చేయడాన్ని తాము ఒప్పుకోమన్నారు.
ఒకే భాష ఒకే దేశం ఒకే పార్టీ నినాదంతో దేశంలోని రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కేంద్రం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వివక్ష పూరిత ధోరణిని తీవ్రంగా తప్పు పట్టారు ప్రధాని మోదీ ముందే స్టాలిన్(MK Stalin). కేంద్రం నుంచి తమిళనాడుకు ఏ మాత్రం నిధులు రావడం లేదని మండిపడ్డారు.
ఇప్పటి దాకా రావాల్సిన బకాయిలు రూ. 21 వేల కోట్లకు పైగా ఉన్నాయని ఇలాగైతే ఎలా అని నిలదీశారు సీఎం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం చెన్నైలో పర్యటించారు.
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ ముందే కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి సుంకాన్ని తగ్గించాలని రాష్ట్రాలను కోరడంపై అభ్యంతరం తెలిపారు స్టాలిన్. ప్రధాని ముందు పలు డిమాండ్లు లేవనెత్తారు.
సమాఖ్య రాజ్యంలో రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున నిధులను పొందుతున్న కేంద్రం రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందంటూ ప్రశ్నించారు సీఎం.
నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. తాము నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నామని, ఈ మేరకు అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశ పెట్టామని చెప్పారు స్టాలిన్(MK Stalin).
తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. హిందీని కాకుండా తమిళ భాషను జాతీయ భాషగా గుర్తించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
Also Read : మేమే ప్రత్యామ్నాయం మార్పు అనివార్యం