MK Stalin Fight : సీఎం ధిక్కార స్వరం
కేంద్రంపై యుద్దానికి సిద్దం
MK Stalin Fight : బలమైన, శక్తివంతమైన నాయకత్వం కేంద్రంలో కలిగి ఉన్నప్పటికీ అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా ఎక్కడా తగ్గడం లేదు డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తన సహచర మంత్రిని మనీ లాండరింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేసినా ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు. ఇదే విషయాన్ని సీనియర్ ఎడిటర్ దిలీప్ మండల్ శుక్రవారం ప్రత్యేకంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
స్టాలిన్ ఎక్కడా ఎక్కువగా మాట్లాడడు. ఆయన నైజమే అంత. తన తండ్రి నుంచి పుచ్చుకున్న నాయకత్వ వారసత్వం అతడిని మరింత రాటుదేలాల చేసింది. తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఏ వ్యక్తులనైనా, వ్యవస్థలనైనా ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్(MK Stalin). తాజాగా మరో వివాదానికి తెర లేపారు గవర్నర్ ఆర్ఎన్ రవి. మంత్రి సెంథిల్ బాలాజీకి చెందిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయిస్తూ ఫైల్ రాజ్ భవన్ కు పంపింది. కానీ గవర్నర్ దానిని తిప్పి పంపారు.
ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఇది రాజ్ భవన్ కాదని అది ఆర్ఎస్ఎస్ భవన్ అనుకుంటున్నారా అంటూ నిలదీశారు. ఇదిలా ఉండగా సంక్షోభం ఎదురైనప్పుడు పార్టీలు సాధారణంగా తమ నాయకులను, సంకీర్ణ భాగస్వామ్యుల పట్ల నిర్దయగా వ్యవహరించిన సంఘటనలు లేక పోలేదు. కానీ ఇప్పుడు ఎవరు ఉన్నా లేక పోయినా ఎంకే స్టాలిన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు.
Also Read : Umair Sandhu : ఆది పురుష్ పై ఉమైర్ సంధు కామెంట్స్