MK Stalin : కోవిడ్ నుంచి కోలుకుంటున్న స్టాలిన్
వెల్లడించిన ఆస్పత్రి వర్గాలు
MK Stalin : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం ఆరోగ్యం గురించి బులెటిన్ ను విడుదల చేసింది.
కోవిడ్ ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ ప్రకారం పరిశోధనలు పూర్తయాయి. ఈ మేరకు స్టాలిన్ ఆరోగ్యానికి సంబంధించి మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి త్వరగా కోలుకుంటున్నారు.
ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు ఆస్పత్రి వైద్యులు. అయితే ఆరోగ్య రీత్యా సీఎంకు మరి కొంత విశ్రాంతి అవసరమని సూచించామని తెలిపారు.
ఇదిలా ఉండగా కోవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరిన సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆరోగ్యం గురించి దేశ ప్రధాన మంత్రి నరేంద్రా దామోదర దాస్ మోదీ(PM Modi) ఫోన్ లో పరామర్శించారు.
త్వరగా కోలుకోలేని ఆకాంక్షించారు. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా జూలై 12న స్టాలిన్ కు కొంత నలతగా అనిపించడంతో వెంటనే వైద్యులు పరీక్షలు చేపట్టారు.
ఇందులో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే గురువారం చెన్నై లోని కావేరి ఆస్పత్రిలో పరిశోధనలు, పరిశీలన కోసం చేర్పించారు.
దేశ ప్రధాని ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం ఆరోగ్యం గురించి అడిగారని పేర్కొంది. మరో వైపు రాష్ట్ర గవర్నర్ ఆర్. ఎన్. రవితో పాటు మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం స్టాలిన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
Also Read : టీచర్ కోసం స్టూడెంట్స్ కంటతడి