MK Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన స్టాండ్ ను ఏ మాత్రం మరిచి పోవడం లేదు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీతో సైతం సంబంధాలు నెరుపుతూనే సున్నితమైన హెచ్చరిక కూడా చేశారు. ఢిల్లీలో పర్యటించిన స్టాలిన్ (MK Stalin )ఆప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసించారు.
ప్రత్యేకించి విద్యా రంగం, ఆరోగ్య రంగాలకు నిధులు కేటాయించడం, కార్యక్రమాలను చేపట్టడాన్ని ఆయన పరిశీలించి కితాబు ఇచ్చారు. ఈ సందర్బంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో స్టాలిన్ (MK Stalin )గంటకు పైగా చర్చించారు.
పలు అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలనే సమైక్య ఫ్రంట్ గా ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు.
వ్యక్తిగత స్వార్థాలను విడిచి పెట్టి ఒకే వేదికపైకి రావాలని లేక పోతే దేశం ప్రమాదంలో పడనుందని హెచ్చరించారు స్టాలిన్.
తమిళనాడులో తమతో స్నేహం ఉన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాలలో పార్టీలతో మైత్రీ బంధాన్ని కొనసాగించాలని సీఎం సూచించారు.
భారతదేశం భిన్నమైన సంస్కృతుల సమ్మేళనం. మన భాష, యాస, సంస్కృతి, నాగరికత, ప్రాంతంపై పట్టు సాధించేందుకు కేంద్రం యత్నిస్తోందని దీనిని ఎదుర్కోవాలన్నారు.
అయితే బీజేపీ పట్ల వ్యతిరేకత లేదన్నారు. అంశాల పైనే తమకు పట్టింపు అని స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : గుజరాత్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్