MK Stalin Kejriwal : ఢిల్లీలో విద్యా..ఆరోగ్య వ్యవస్థ భేష్ – స్టాలిన్
పాఠశాలలు..క్లినిక్ లు సందర్శించిన సీఎం
MK Stalin : తమిళనాడు (Tamil Nadu) సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ఢిల్లీలో ఆప్ (AAP) సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూళ్లు, క్లినిక్ లను సందర్శించారు. ఈ సందర్బంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దగ్గరుండి సాదర స్వాగతం పలికారు.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, పిల్లలతో మాట్లాడారు స్టాలిన్ (Stalin) . మొహల్లా క్లినికల్ ను సందర్శించారు. అందరి ఆలోచనలు ఒకరి నుంచి మరొకరు పంచుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్(MK Stalin).
ఇవాళ తనకు సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ సర్కార్ విద్యా, ఆరోగ్య వ్యవస్థలకు అత్యధికంగా ప్రయారిటీ ఇవ్వడం భేష్ అని కితాబు ఇచ్చారు. స్టాలిన్ (Stalin) , కేజ్రీవాల్ (Kejriwal) చాలా సేపు చర్చించారు. వివిధ అంశాలు చర్చకు వచ్చాయి.
వీరిద్దరి కలయిక రాజకీయాలలో చర్చకు దారి తీసింది. భేటీపై ఎంకే స్టాలిన్(MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్.
అంతకు ముందు ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఒకటైన వెస్ట్ వినోద్ నగర్ లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయంలో స్టాలిన్ కు స్వాగతం పలికారు సీఎం కేజ్రీవాల్ (AAP) . పాఠశాలకు చెందిన టీచర్లు, విద్యార్థులు గులాబీలు అందజేశారు.
ఈ సందర్భంగా తమకు కల్పించిన సౌకర్యాలను చూసి సీఎం స్టాలిన్ విస్తు పోయారని హెచ్ఎం మేరీ జ్యోస్త్నా మింజ్ పేర్కొన్నరారు. నర్సరీ, కిండర్ గార్డెన్ విద్యార్థుల కార్యకలాపాల విభాగాన్ని కూడా సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రపంచ స్థాయిలో చెన్నైలో ప్రభుత్వ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు స్టాలిన్.
Also Read : ఇబ్బందులున్నా బంధం బలంగా ఉంది