MK Stalin : విద్య..వైద్యం సమాజానికి అవసరం – స్టాలిన్
వాటిపై చేసే ఖర్చు మంచిదే
MK Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విద్య, వైద్యం అన్నది ఇవాళ వ్యాపారంగా మారింది. వాటిపై చేసే ఖర్చు సమాజానికి మేలు చేకూరుస్తుందే తప్పా నష్టం చేకూర్చదని స్పష్టం చేశారు సీఎం.
ఇటీవల కేంద్ర సర్కార్ తో పాటు సుప్రీంకోర్టు ప్రజలకు ఇచ్చే ఉచితాలు ప్రమాదకరమని పేర్కొన్నాయి. వీటిని తీవ్రంగా తప్పు పట్టారు స్టాలిన్. ఆరోగ్యం, విద్య ప్రతి ఒక్కరికీ అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
ఇందు వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. పేదలు, బలహీనులకు ముఖ్యంగా అవసరమని కుండ బద్దలు కొట్టారు. వీటిని ఎవరైనా వద్దని అంటున్నారో వారు వ్యాపారులకు, కార్పొరేట్ లకు, కంపెనీలకు మేలు చేకూర్చిన వారవుతారని ఎద్దేవా చేశారు సీఎం(MK Stalin).
ఉచిత పథకాలు దేశ అభివృద్ధికి ప్రతిబంధాకాలు అంటూ వ్యాఖ్యానించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు ఎంకే స్టాలిన్.
వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతూ, రూ. 10 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత మోదీకి దక్కుతుందని ఆయన ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతారని ప్రశ్నించారు స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
కొలత్తూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఉచితాలు, సంక్షేమ పథకాలు వేర్వేరని చెబితే రాజకీయం అవుతుందన్నారు. విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఉచితాల కిందకు రాదన్నారు.
ఎందుకంటే విద్య జ్ఞానం సంపాదించేందుకు..వైద్యం ఆరోగ్యానికి సంబంధించిందన్నారు. ప్రస్తుతం స్టాలిన్ చేసిన కామెంట్స్ కలకలం రేగింది.
Also Read : మోదీ సర్కార్ పై మనీశ్ సిసోడియా ఫైర్