MK Stalin : పేద‌ల ముంగిట వైద్యం – ఎంకే స్టాలిన్

నాన్ ముద‌ల్వ‌న్ ప‌థ‌కానికి శ్రీ‌కారం

MK Stalin : త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులో ఉండేలా చేస్తామ‌న్నారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్. యావ‌త్ ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా త‌మిళ‌నాడుకు చెందిన వాళ్లు టాప్ లెవ‌ల్లో ఉండాల‌ని కోరారు.

మేధ‌స్సు, నైపుణ్యం క‌లిగిన విద్యార్థుల‌ను తీర్చిదిద్దేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అన్ని రంగాల‌లో అనుభ‌వం క‌లిగిన వారంతా రాష్ట్రంలోనే ఉండేలా నాన్ ముద‌ల్వ‌న్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు ఎంకే స్టాలిన్(MK Stalin).

చెంగ‌ల్ప‌ట్టు జిల్లా ప‌య‌నూరు లోని సాయ్ యూనివ‌ర్శిటీలో కొత్త‌గా నిర్మించిన భ‌వ‌నాల‌ను సీఎం ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ్రెయిన్ డ్రైయిన్ అనేది త‌మిళ‌నాడుకు న‌ష్టం క‌లిగిస్తుంద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ హ‌యాంలో 13 విశ్వ విద్యాల‌యాలు ఉన్నాయ‌ని, తాజాగా ప్రైవేట్ విద్యా సంస్థ అయిన సాయ్ యూనివ‌ర్శిటీ చేర‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

విశ్వ విద్యాల‌యంకు సంబంధించిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాలు పంచు కోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు ఎంకే స్టాలిన్. గ‌తంలో దివంగ‌త సీఎం క‌రుణానిధి ఉన్న‌త విద్య‌కు సంబంధించిన ప్ర‌వేశ పరీక్ష‌ను ర‌ద్దు చేశార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు సీఎం.

రాష్ట్రంలో దాదాపు 51.4 శాతానికి పైగా విద్యార్థులు ఉన్న‌త విద్యను అభ్య‌సిస్తున్నార‌ని తెలిపారు. ఈ ఘ‌న‌త ఆనాటి సీఎంకు చెందుతుంద‌న్నారు..

ఇంజ‌నీరింగ్, వైద్య విద్య‌లో ఎంట్రెన్స్ టెస్టు ర‌ద్దు చేసి స‌త్తా చాటార‌ని, దీనిని సుప్రీంకోర్టులో స‌వాల్ చేసి సాధించార‌ని కొనియాడారు స్టాలిన్(MK Stalin). పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు గాను 256 సంచార వైద్య వాహ‌నాల‌ను ప్రారంభించారు.

Also Read : పేద‌ల‌కు ఉచితంగా న్యాయం అందించండి

Leave A Reply

Your Email Id will not be published!