MK Stalin Amit Shah : అమిత్ షాపై ఎంకే స్టాలిన్ క‌న్నెర్ర‌

హిందీగా మార్చే ప్ర‌య‌త్నాలు ఆపండి

MK Stalin Amit Shah :  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పై నిప్పులు చెరిగారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin Amit Shah). భార‌త దేశాన్ని హిందీ దేశంగా మార్చే ప్ర‌య‌త్నాల‌ను మాను కోవాల‌ని హెచ్చ‌రించారు.

భార‌త రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లోని మొత్తం 22 భాష‌ల‌ను ప్ర‌భుత్వ అధికారిక భాష‌లుగా ప్ర‌క‌టించాల‌ని స్టాలిన్ డిమాండ్ చేశారు. హిందీ భాష‌పై బీజేపీ నాయ‌కుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై స్టాలిన్ ఎదురు దాడి చేశారు.

ప్ర‌ధానంగా అమిత్ షా దేశాన్ని ఉద్ద‌రించే భాష‌గా హిందీని పేర్కొంటున్నార‌ని అది త‌న‌కు , పార్టీకి, దేశానికి మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. స్థానిక భాష‌ల‌కు పోటీదారుడు కాద‌ని స్నేహితుడిగా ఉండాల‌ని కోరుకోవాల‌న్నారు ఎంకే స్టాలిన్.

ఈ సంద‌ర్భంగా తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం చెప్పారు ఎంకే స్టాలిన్. ఇదిలా ఉండ‌గా నేను ఒక విష‌యం స్ప‌ష్టంగా చెప్పాల‌ని అనుకుంటున్నా.

హిందీ, గుజ‌రాతీ, హిందీ త‌మిళం , హిందీ మ‌రాఠీలు పోటీదారుల‌ని కొంద‌రు త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తున్నారు. దేశంలోని మ‌రే ఇత‌ర భాష‌కు హిందీ పోటీగా ఉండ‌ద‌న్నారు అమిత్ షా.

హిందీ దినోత్స‌వం సంద‌ర్భంగా సూర‌త్ లో జ‌రిగిన అఖిల భార‌త అధికార భాషా స‌ద‌స్సులో ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

భార‌త దేశాన్ని హిందీగా మార్చే ప్ర‌య‌త్నాన్ని ఆపాల‌ని స్ప‌ష్టం చేశారు ఎంకే స్టాలిన్. హిందీ దినోత్స‌వం కాకుండా ఇత‌ర భాష‌ల దినోత్స‌వాల‌ను కూడా దేశ వ్యాప్తంగా జ‌రుపు కోవాల‌ని కోరారు సీఎం.

Also Read : మ‌రాఠాకు గుజ‌రాత్ కంటే బెట‌ర్ ప్రాజెక్టు

Leave A Reply

Your Email Id will not be published!