MK Stalin : కేంద్ర సర్కార్ తన పనితీరు మార్చు కోవడం లేదు. కయ్యానికి కాలు దువ్వుతోంది. ప్రధానంగా బీజేపీయేతర పార్టీలు, వ్యక్తులు, కంపెనీలను, ప్రభుత్వాలను, సంస్థలను టార్గెట్ చేస్తోంది.
తన ఆధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. కాళ్ల బేరానికి వస్తే సరి లేక పోతే అరెస్టులు, కేసులతో వేధింపులకు గురి చేస్తోంది. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా మరో వివాదానికి తెర తీశారు.
ఆయన ఇంగ్లీష్ కాకుండా హిందీలోనే అన్ని రాష్ట్రాలు మాట్లాడాలంటూ హుకూం జారీ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పలు చోట్ల ఆందోళనలు మిన్నంటాయి. కానీ షా వెనక్కి తగ్గడం లేదు.
దీనిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ ఉన్నది మాత్రం తమిళనాడు మాత్రమే. తాజాగా కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ ( సీయూఈటీ)ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసింది. ఇదిలా ఉండగా ఈ తీర్మానానికి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే సైతం మద్దతు ఇచ్చింది. అయితే కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ని యూజీ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష చేపడతారు.
దీని వల్ల ఆయా రాష్ట్రాలలో చదువుకుంటున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంకే స్టాలిన్(MK Stalin).
విద్యార్థుల చదువు కునేందుకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు స్టాలిన్.
Also Read : నీతి ఆయోగ్ లిస్టులో గుజరాత్ టాప్