MK Stalin : కేంద్ర స‌ర్కార్ తీరుపై స్టాలిన్ ఫైర్

ఎంపీల స‌స్పెన్ష‌న్ ర‌ద్దు చేయాలి

MK Stalin : త‌మిళ‌నాడు – పార్ల‌మెంట్ లో తాజాగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను రేపుతోంది. ఇదే స‌మ‌యంలో లోక్ స‌భ జీరో అవ‌ర్ లో కొంద‌రు ఆగంత‌కులు ప్ర‌వేశించ‌డంతో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. ఈ ఒక్క ఘ‌ట‌న విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో పార్ల‌మెంట్ పై దాడి జ‌రిగి 22 ఏళ్ల‌వుతోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి 9 మంది ఆఫీస‌ర్ల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టింది.

MK Stalin Serious Comments on Centre

ఇదే స‌మ‌యంలో ఎంపీ ప్ర‌తాప సింహా ద్వారా పాస్ లు తీసుకుని వ‌చ్చార‌ని , దీని వెనుక ఉన్న ప్ర‌ధాన ఉద్దేశం ఏమిటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది. ఇదే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఎంపీలు పెద్ద ఎత్తున ప‌ట్టుప‌ట్టారు. దీనిపై సీరియ‌స్ అయ్యారు స్పీక‌ర్ ఓం బిర్లా. 15 మంది ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.

దీనిపై తీవ్రంగా స్పందించారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin). ఇది కావాల‌ని చేసిన‌ట్టుగా అనిపిస్తోంద‌ని పేర్కొన్నారు. ఎంపీల‌పై వేసిన వేటును తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్య విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో చ‌ర్చ‌కు పార్ల‌మెంట్ వేదిక‌గా ఉండాల‌ని , వ్య‌క్తిగ‌త చ‌ర్య‌ల‌కు దిగ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఎంకే స్టాలిన్.

Also Read : Pawan Kalyan : గెలుపు ఖాయం అధికారం త‌థ్యం

Leave A Reply

Your Email Id will not be published!