MK Stalin : వీసీల నియమించే అధికారం, హక్కు రాష్ట్రానికి ఉండాలని స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin). వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేక పోవడ ఉన్నత విద్యపై ప్రభావం చూపుతుందన్నారు.
ప్రస్తుతం గవర్నర్ వ్యవహార శైలి గందర గోళానికి దారి తీస్తోందంటూ స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీసీల అధికారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పించే బిల్లును తమిళనాడు అసెంబ్లీ సోమవారం ఆమోదించింది.
రాష్ట్ర, కేంద్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రెండు రోజుల సదస్సుకు గవర్నర్ ఆర్ .ఎన్. రవి ఆతిథ్యం ఇస్తున్నారు. ఇదే రోజున తమిళనాడు విశ్వ విద్యాలయాల చట్టాలను సవరించే చట్టాన్ని ప్రవేశ పెట్టడం గమనార్హం.
ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు స్టాలిన్. దీని వల్ల ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ తో కూడా ఆయన పోలిక పెట్టారు.
ఇదిలా ఉండగా ఈ బిల్లును ప్రవేశ పెట్టాడాన్ని ప్రతిపక్షాలైన ఏఐఏడీఎంకే, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ సభా వేదిక నుంచి మాట్లాడారు.
సంప్రదాయం ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తారు. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్స్ ను నియమిస్తారు. గత నాలుగు సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ వచ్చింది.
గవర్నర్లు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఆచారం ఎన్నికైన ప్రభుత్వాన్ని అగౌరవ పర్చడం తప్ప మరొకటి కాదన్నారు స్టాలిన్.
ప్రస్తుత వ్యవస్థ యూనివర్శిటీల పరిపాలనలో గందర గోళానికి దారి తీస్తుందన్నారు.
Also Read : సీఎం ఇంటిపై దౌర్జన్యం భద్రతా వైఫల్యం