MK Stalin : తమిళనాడు భగ్గుమంటోంది. బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికంతటికీ కారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థ డీఎంకే కు చెందిన మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ సందర్బంగా సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) నిప్పులు చెరిగారు. కేంద్రం కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఆపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పర్మిషన్ లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్థానం లేదని పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా ఎవరినీ విచారించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.
తమ కార్యకర్తలను ముట్టుకున్నా లేదా తమ జోలికి వచ్చే ప్రయత్నం చేసినా ఊరుకునేది లేదంటూ స్పష్టం చేశారు. ఒకవేళ కావాలని తమ వారిని ముట్టు కోవాలని ట్రై చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు సంయమనం పాటించామని ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా తమిళనాడు సీఎం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Also Read : Devendra Fadnavis : ఆదిపురుష్ టీమ్ కు విషెస్ – ఫడ్నవీస్