MK Stalin : బీజేపీపై యుద్దం హిందీపై పోరాటం
సీఎం ఎంకే స్టాలిన్ షాకింగ్ కామెంట్స్
MK Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. హిందీ భాష పేరుతో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో ఎందరో ఇలాంటి ప్రయోగాలు చేయాలని చూశారని కానీ వారి ఆటలు సాగలేదని గుర్తు పెట్టుకోవాలన్నారు స్టాలిన్(MK Stalin).
హిందీని బలవంతంగా రుద్దాలని కేంద్రం చూస్తోందని కానీ తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు సీఎం. ఒకే భాషతో ఇతర జాతుల సంస్కృతిని నాశనం చేసేందుకు బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. తమ పార్టీ ప్రజలపై భాషను బలవంతం చేసే ప్రయత్నాలను ప్రతిఘటిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్.
గతంలో రాష్ట్రంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా మరణించిన వారి స్మారకార్థం అమర వీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎంకే స్టాలిన్ ప్రసంగించారు. బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని అధికార బీజేపీ హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తోందని ధ్వజమెత్తారు సీఎం.
ఒకే దేశం, ఒకే మతం, ఒకే ఎన్నికలు, ఒకే ప్రవేశ పరీక్ష, ఒకే ఆహారం, ఒకే సంస్కృతి ఇలా ఒకే భాషతో భిన్న జాతుల సంస్కృతిని మట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.
గత ఏడాది 2022 అక్టోబర్ లో హిందీ భాషకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగిందన్నారు. బీజేపీ నర్మగర్భంగా హిందీ ప్రయోగానికి పాల్పడుతోందని ఆరోపించారు ఎంకే స్టాలిన్(MK Stalin).
Also Read : కాంగ్రెస్..డీఎంకే కూటమికి మద్దతు – కమల్