Chenna Keshava Reddy : పోర్న్ పై వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్
చెన్న కేశవరెడ్డి వ్యాఖ్యలు కలకలం
Chenna Keshava Reddy : ఎమ్మిగనూరు – ఏపీలోని ఎమ్మిగనూరు శాసన సభ నియోజకవర్గం వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మృదు స్వభావిగా పేరుంది. కానీ ఉన్నట్టుండి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రభుత్వం చదువుకునేందు కోసం భారీ ఎత్తున ఖర్చు చేసి విద్యార్థులకు ట్యాబ్ లు, లాప్ టాప్ లు పంపిణీ చేసింది. వీటిని స్కూళ్లు, కాలేజీలలో చదువుకునే ప్రతి ఒక్కరికీ అందజేసింది.
Chenna Keshava Reddy Comments Viral
అయితే విద్యార్థులు చదువుపై కంటే కేవలం పోర్న్ మాత్రమే చూస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్న కేశవ రెడ్డి(Chenna Keshava Reddy). ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులే పోర్న్ మూవీస్ చూస్తున్నారా ..కార్పొరేట్ సంస్థల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ చూడటం లేదా అని ప్రశ్నించారు.
దీంతో చెన్న కేశవ రెడ్డి ఉన్నట్టుండి ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. అంతే కాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు పోర్న్ సైట్స్ చూడటం లేదా అంటూ మండిపడ్డారు. ట్యాబ్ లు, లాప్ టాప్ ల వివాదంపై స్పందించిన చెన్న కేశవరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ఒకింత విస్తు పోయేలా చేసింది. ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా కుదుపునకు గురి చేశాయి.
Also Read : Nara Lokesh : సంక్షోభంలో వ్యవసాయ రంగం