Kotam Reddy Sridhar Reddy : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం
ఎమ్మెల్యే కోటం రెడ్డి షాకింగ్ కామెంట్స్
Kotam Reddy Sridhar Reddy : ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన స్నేహితుడితో మాట్లాడిన సంభాషణ బయటకు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ద్వారా తనకు తెలిసిందంటూ బాంబు పేల్చారు.
తన ఫోన్ ట్యాపింగ్ కు గురవుతున్న విషయాన్ని పీఎస్సార్ తెలిపారని చెప్పారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇదే విషయం గురించి బహిరంగంగా ఎమ్మెల్యే ప్రకటించడం తలనొప్పిగా మారింది ఏపీ సీఎం జగన్ రెడ్డికి. తన ఫోన్ మాత్రం ట్యాపింగ్ కాలేదని మంత్రులు చిలుక పలుకులు పలుకుతున్నారని కానీ ఇదిగో తన ఫోన్ ఎలా ట్యాపింగ్ కు లోనైందోనని ఆయన వాస్తవాలు బయట పెట్టారు.
దీనిపై మంత్రులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే శ్రీధర్ రెడ్డి మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నాడంటూ వాపోయారు. వైసీపీలో ఇక నుంచి తాను కొనసాగేది లేదంటూ ప్రకటించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇలా ఎంత కాలం తాను అవమానాలు , అవహేనలు భరించాలని ప్రశ్నించారు.
తాను చెబుతున్నది తప్పని నిరూపించ గలరా అంటూ మంత్రులను నిలదీశారు. నా కోసం , పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు బాగుండాలని కోరుకునే వాడిని నేను. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా సీఎం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడ లేదన్నారు శ్రీధర్ రెడ్డి(Kotam Reddy Sridhar Reddy).
Also Read : పప్పు నాయుడుకు అంత సీన్ లేదు – రోజా