MLA Laxma Reddy : లోక కళ్యాణం కోసం మహా యాగం
మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి
MLA Laxma Reddy : శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో జడ్చర్లలో జరుగుతున్న అయుత చండీయాగం అతిరుద్ర మహా యాగం లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి , స్థానిక శాసనసభ్యులు చర్లకోల లక్ష్మారెడ్డి. యాగ శాలలో స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
MLA Laxma Reddy in Ayutha Chandi Yagam
శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ మంగళా శాసనాలు అందజేశారు చర్లకోల లక్ష్మా రెడ్డికి(MLA Laxma Reddy). ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడారు. స్వామి వారు సత్ సంకల్పంతో ఈ పవిత్రమైన కార్యాన్ని తలపెట్టడం తనకు మిక్కిలి సంతోషంగా ఉందన్నారు. లోక కళ్యాణం కోసం, మానవ జాతి అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అతి రుద్ర యాగాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు చర్లకోల లక్ష్మారెడ్డి.
భక్తి భావం , సేవా భావం రెండూ జీవితంలో గొప్పవని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు స్వామి వారి ఆశీస్సులు పొందాలని , వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇలాంటి అద్భుతమైన, విశిష్టమైన సత్ కార్యాన్ని తలపెట్టినందుకు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థలంలో నిర్వహించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు చర్లకోల లక్ష్మారెడ్డి.
Also Read : Arvind Kejriwal : ఇస్రో శాస్త్రవేత్తల కృషి భేష్