Raghunandan Rao : రఘునందన్ ఆడియో లీక్ వైరల్
అసలు కిషన్ రెడ్డికి ఏం అర్హత ఉంది
Raghunandan Rao : తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందో తెలియక శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. పార్టీ చీఫ్ గా ఉన్న బండికి చెక్ పెట్టింది . అనూహ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. రెడ్డిని నియమించినా ఇంకా అసంతృప్తి చల్లారడం లేదు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) చేసిన కామెంట్స్ తో కూడిన ఆడియో తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది.
కిషన్ రెడ్డికి ఏం అర్హత ఉంది. తనకు ఏం అర్హత లేదో చెప్పాలన్నారు. ప్రెసిడెంట్ రేసులో తాను ఎందుకు ఉండకూడదంటూ ప్రశ్నించారు. తాను వెలమ కులానికి చెందిన వాడినని, కేసీఆర్ కు అనుకూలంగా ఉంటానని పార్టీలోని కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.
బీజేపీ, బీఆర్ఎస్ కాదు ఓ వర్గానికి చెందిన మీడియా తనను పక్కన పెట్టిందంటూ మండిపడ్డారు. టీడీపీ జెండా మోసేవాళ్లంతా రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి రెడ్డి వర్గం అంతా గంప గుత్తగా సపోర్ట్ చేస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు నెలలు ఆగితే ఈ బలుపు ఉంటుందా అన్నది తేలుతుందన్నారు. పార్టీలోనే ఉంటా దుబ్బాక నుంచి రెండోసారి బరిలో ఉంటా..మళ్లీ గెలుస్తానని అన్నారు.
Also Read : Meta Threads : ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్
