MLA Rajaiah KTR : కడియం పవర్ స్టేషన్ గా మారారు
ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య
MLA Rajaiah KTR : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం , ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరకు ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదం మరింత ముదరడంతో హైకమాండ్ సీరియస్ అయ్యింది. వెంటనే రావాల్సిందిగా ప్రగతి భవన్ నుంచి సమాచారం వచ్చింది. దీంతో హుటా హుటిన ఎమ్మెల్యే రాజయ్య హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే రాజయ్య. కడియం శ్రీహరి కావాలనే తనను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. అంతే కాకుండా పవర్ స్టేషన్ గా మారారంటూ పేర్కొన్నారు. ఇద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయనే దాని గురించి కేటీఆర్(KTR) ఆరా తీశారని తెలిపారు.
హైకమాండ్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. నీ పని నీవు చేసుకుంటూ వెళ్లు అని తనకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు తాటికొండ రాజయ్య. కడియం వ్యవహారంపై పూర్తిగా సమాచరం మంత్రికి తెలియ చేశానని పేర్కొన్నారు. ఇక నుంచి విభేదాలకు పుల్ స్టాప్ పెట్టాలని కేటీఆర్ సూచించారని పేర్కొన్నారు.
Also Read : KTR Revanth Reddy : రేవంత్ కామెంట్స్ పై కేటీఆర్ ఫైర్