MLA Ramakrishna Reddy: వైఎస్ జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
MLA Ramakrishna Reddy : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్టా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ ఖాయమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (MLA Ramakrishna Reddy) అన్నారు. జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో డేట్ చెప్పలేమని… అరెస్ట్ మాత్రం ఖాయమని తెలిపారు. లిక్కర్ కేసు నిందితులు బిగ్‌బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అప్పట్లో చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని గుర్తు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ, అందుకే ఆ పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొనడం లేదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Ramakrishna Reddy Slams YS Jagan
జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ తానే అధికారంలోకి వస్తానన్న భ్రమలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. గత 78 ఏళ్లలో ఎప్పుడులేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తి సహకారం అందిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అన్నారు.
Also Read : Minister Savita: పులివెందుల ఎన్నికపై జగన్ భయపడుతున్నాడు – మంత్రి సవిత
