Rekha Naik : హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన అధికార పార్టీ బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ప్రస్తుతం రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా పార్టీలకు చెందిన సీనియర్ , కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
Rekha Naik Joined in Congress
ఇప్పటికే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, వసంత నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి హస్తం గూటికి చేరారు.
తాజాగా వీరి జాబితాలోకి మరో ఎమ్మెల్యే చేరారు. ఖానాపూర్ శాసన నియోజకర్గానికి భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి జరిగే ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. మొత్తం 115 సీట్లకు గాను అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ లిస్టులో 7 గురికి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు.
ఈ జాబితాలో స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్(Rekha Naik) ఉన్నారు. దీంతో ఆమె పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరింది.
Also Read : AP CM YS Jagan : దుర్గమ్మ సన్నిధిలో జగన్ రెడ్డి