MLC Duvvada Srinivas: విద్యుత్ శాఖ ఏఈకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను బెదిరింపులు
విద్యుత్ శాఖ ఏఈకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను బెదిరింపులు
Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ సారి ప్రభుత్వ అధికారిపై తనదైన శైలిలో రెచ్చిపోయారు. బిల్లు కట్టనందుకు విద్యుత్ కనెక్షన్ ను నిలిపివేసిన టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ(AE) మురళీకృష్ణను ఫోన్ లో దుర్భాషలాడారు. ఒక ఎమ్మెల్సీ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి నీకెంత ధైర్యం. నీ సంగతి చూస్తా. టెక్కలిలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ ఏఈని బెదిరించారు. వినియోగదారుల ఫోరంలో కేసు వేసి… నువ్వు జాబ్ నుండి రిటైర్మెంట్ అయ్యే వరకు కోర్టు చుట్టూ తిప్పిస్తా అంటూ ఫోన్ లో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
MLC Duvvada Srinivas Comments
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) కు సంబంధించి టెక్కలిలో ఉన్న ఇంటికి సుమారు 56వేల రూపాయల విద్యుత్ బిల్లు బకాయి ఉంది. దీనితో అధికారులు పలుమార్లు దువ్వాడ శ్రీనివాస్, అదే విధంగా అతనితో సహజీవనం చేస్తున్న మాధురికి సమాచారం అందించారు. అయితే వారు బిల్లు కట్టకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం… మాధురి వారం రోజుల క్రితమే బిల్లు కట్టేసారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపివేసారని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ కు ఫోన్ చేసిన… ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాస్త దురుసుగా ప్రవర్తించారు. తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగించడంపై ఆగ్రహించిన దువ్వాడ… టెక్కలి నుంచి పారిపోయేలా చేస్తానని ఏఈని హెచ్చరించారు. ‘‘ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి విద్యుత్ కట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం. టెక్కలిలో చాలా మంది విద్యుత్ బిల్లులు కట్టడం లేదు. నేను వారి లిస్ట్ ఇస్తాను. మీరు వారికి కూడా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారా అని ప్రశ్నించారు. అంతేకాదు ఎవరితో పెట్టుకుంటున్నావ్ు తెలుసా. ఒక్క ఎమ్మెల్సీ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తావా. నీ సంగతి తేలుస్తా. వినియోగదారుల ఫోరంకు లాగుతాను. నరకం చూపిస్తాను. టెక్కలి నుంచి పారిపోయేటట్టు చేస్తాను. ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను’’ అంటూ ఫోన్ లో రెచ్చిపోయారు.
Also Read : Family Suicide: అమీన్‌పూర్ లో విషాదం ! ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి !