MLC Election Notification: ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల !
ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల !
MLC Election : టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీల కౌంటింగ్ కొనసాగుతుండగానే మరో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసారు. జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు..యనమల రామకృష్ణుడుల పదవి కాలం ఈ నెల 29 తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటి సెక్రటరీ ఆర్ వనితా రాణిని ఎన్నికల కమిషన్ నియమించింది. మరో ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియామించింది. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ తన నోటిఫికేషన్ లో పేర్కొంది.
AP MLC Election
ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం… ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు అవకాశముంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు.
Also Read : MLC Election Notification: ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల !