MLC Kavitha : నా అరెస్ట్ పై ఏజెన్సీలు చెప్పాలి – కవిత
బీజేపీ నేతలు కాదన్న ఎమ్మెల్సీ
MLC Kavitha Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha Liquor Scam) సంచలన కామెంట్స్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తన అరెస్ట్ గురించి పదే పదే అడగడంతో కల్వకుంట్ల కవిత కూల్ గా సమాధానం ఇచ్చారు. తన అరెస్ట్ గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ చెప్పాలన్నారు. వాళ్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఇక సీబీఐ కోర్టు మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుని త్వరగా విచారణ ముగించాలని ఆదేశించింది. దీంతో సిసోడియా అరెస్ట్ తర్వాత ఢిల్లీ, తెలంగాణలలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు ఆమె. నాకంటే మీకే తొందర ఎక్కువగా ఉన్నట్టు ఉందంటూ కామెంట్ చేశారు.
కాగా ఇప్పటికే ఈడీ, సీబీఐ దూకుడు పెంచింది. కవిత స్వయంగా తన ఫోన్లను ధ్వంసం చేసిందని కూడా దర్యాప్తు సంస్థ ఆరోపించింది. కేవలం విపక్ష నేతలను, బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం కావాలని టార్గెట్ చేస్తోందన్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతం అదానీపై ఎందుకు దాడి చేయడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). మోదీ వైఫల్యాలపై నిలదీస్తే తమను టార్గెట్ చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఢిల్లీ వేదికగా నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.
Also Read : తెలంగాణలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడి