MLC Kavitha : అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో చేరిన ఎమ్మెల్సీ కవిత
అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు...
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేరారు. ఈరోజు సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి కవిత(MLC Kavitha) గురైన విషయం తెలిసిందే. గతంలో తిహాడ్ జైల్లో ఉండగా కవిత రెండు సార్లు అస్వస్థతకు లోనయ్యారు. జూలై 16న తొలిసారిగా కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కవిత(MLC Kavitha) విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందించారు. ఆ తర్వాత ఆగస్టు-22న మరోసారి కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి జైలుకు తీసుకెళ్లారు. కొంతకాలంగా కవిత గైనిక్ సమస్యలతో బాధపడుతూ ఉండటం.. దీనికి తోడు ఇటీవల వైరల్ జ్వరం బారినపడ్డారు. దీంతో.. కవిత భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు.
MLC Kavitha Admitted in…
కవిత జైల్లో ఉండగా 11 కిలోల బరువు తగ్గారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడంతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. అంతేకాదు.. సోదరి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన అన్న.. ఒక్కొక్కటిగా బయటికి చెప్పారు. కవితకు బీపీ పెరగడంతో మాత్రలు వేసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అంతేకాదు.. జైలు శుభ్రంగా లేదని, కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 11 వేల మంది ఖైదీలు ఉండాల్సిన తిహాడ్ జైల్లో 30 వేల మంది ఉన్నారన్నారు. బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.
ఈ ఆగస్టు-27న ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ తర్వాత కవితకు బెయిల్ వచ్చింది. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ ఆమె అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఆమె సుమారు ఐదున్నర నెలలు జైలులోనే ఉన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు.
Also Read : Sunita Williams : అంతరిక్షం నుంచి భూమిపైకి ఫిబ్రవరిలో రానున్న సునీతా విలియమ్స్