MLC Kavitha Supreme Court : సుప్రీంకోర్టుకు కవిత మరోసారి
అత్యవసర పిటిషన్ దాఖలు
MLC Kavitha SC : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 16న ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా వాయిదా పడింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, వెసులుబాటు ఇవ్వాలని సూచిస్తూ తన లాయర్ సామ భరత్ వెంట ఓ నోట్ ఈడీ ఆఫీసుకు పంపింది.
అప్పటి దాకా టెన్షన్ చోటు చేసుకుంది. అంతకు ముందు తనను ఈడీ టార్చర్ చేస్తోందని , థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని , తన సెల్ ఫోన్ ను బలవంతంగా సీజ్ చేసిందని , ఒక మహిళగా తన హక్కులను కాల రాసిందని ఆరోపించింది.
వెంటనే ధర్మాసనం తనను ప్రశ్నించకుండా ఉండేలా, తనను ఇంటి వద్ద విచారణ జరిపేలా ఈడీని ఆదేశించాలని కోరింది. అంతే కాదు స్టే విధించాలని విన్నవించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్టే ఇవ్వడం కుదరదు అంటూ స్పష్టం చేసింది.
చట్టం ముందు అంతా సమానమేనని ఈడీ ముందుకు వెళ్లాలని సూచించింది. దీంతో హాజరు కాలేదు. తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని , 24న తీర్పు వస్తుందని ఆ తర్వాత ఈడీ వద్దకు వస్తానని తెలిపింది.
దీనిపై సీరియస్ గా స్పందించింది ఈడీ. తాము ఒప్పుకునే పరిస్థితి లేదని మార్చి 20న రావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha SC) , తన పటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరనున్నారు.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం