MLC Kavitha ED : ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ
MLC Kavitha ED Office : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఒకసారి సీబీఐ హైదరాబాద్ లో కవిత నివాసంలో విచారించింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి మద్యం కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈడీ కూపీ లాగింది. ఢిల్లీ కోర్టులో మనీష్ సిసోడియాను హాజరు పర్చింది. సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలువరించింది. మద్యం స్కాంకు అంకురార్పణ జరిగింది పూర్తిగా హైదరాబాద్ లోనేని స్పష్టం చేసింది. సిసోడియాకు సంబంధించిన తన ఫోన్లను తానే ధ్వంసం చేశాడని, ఇతరుల ఫోన్లతో తతంగాన్ని జరిపించాడంటూ ఆరోపించింది.
లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించింది కల్వకుంట్ల కవిత(MLC Kavitha ED Office) అని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఈడీ నోటీసు జారీ చేసింది. 9న హాజరు కావాల్సి ఉండగా తనకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయని 15 కు వస్తానని తెలిపింది ఎమ్మెల్సీ కవిత. ఇందుకు ఈడీ ఒప్పుకోలేదు. ఇప్పటికే ఛాన్స్ ఇచ్చామని మార్చి 11న హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
దీంతో గత్యంతరం లేక కవిత బిగ్ ప్లాన్ వేసింది..మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలంటూ హల్ చల్ చేసే ప్రయత్నం చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ఇంతవరకు మహిళలకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు విప్పలేదంటూ ప్రశ్నించాయి. ఇక ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) అండగా ఉండేందుకు కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు.
Also Read : కవితకు రక్షణగా కేటీఆర్