MLC Kavitha Gaddar : దిగ్గజ గాయకుడు గద్దర్ – కవిత
ఆయన మరణం తీరని విషాదం
MLC Kavitha Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ మరణించడం తీరని లోటు అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha). లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా గాయకుడి పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు.
MLC Kavitha Gaddar A legendary singer
ఈ శతాబ్దంలో గర్వించ దగిన గాయక యోధుడు గద్దర్ అని కొనియాడారు. ఆయన పాటలతో తాను కూడా ప్రభావితం అయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన చరిత్ర గద్దర్ కు ఉందన్నారు. మలి దశ ఉద్యమం మొత్తం ఆయన ఆట, పాటలతో నడిచిందని కొనియాడారు.
ఒక రకంగా ప్రజా యుద్ద నౌక నిష్క్రమించడం యావత్ సమాజానికి , దేశానికి తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత. ఒకటా రెండా వందలాది పాటలతో ఆట, మాటతో కోట్లాది ప్రజలను చైతన్యవంతం చేసిన మహనీయుడు, మహా గాయకుడు గద్దర్ అని ప్రశంసించారు.
గద్దర్ 1949లో సంగారెడ్డి నియోజకవర్గంలోని తూఫ్రాన్ లో పుట్టారు. ఆయన వయసు 74 ఏళ్లు. తొలుత కెనెరా బ్యాంకులో జాబ్ చేశారు. ప్రజల కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. నక్సల్ ఉద్యమంలో చేరాడు. తన ఆట, పాటలతో ఊపిరి పోశాడు. దేశంలో జరిగిన అనేక ఉద్యమాలకు గద్దర్ చోదక శక్తిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అన్ని పోరాటాలలోను ముందంజలో ఉన్నాడు గద్దర్.
జనం కోసం గానం చేసిన అరుదైన గాయకుడు గద్దర్. ప్రజా యుద్ద నౌకకు మరణం లేదని , పాటకు చావు లేదని నిరూపించాడు గద్దర్.
Also Read : KTR Tribute Gaddar : గద్దర్ జనం గొంతుక యుద్ద నౌక