MLC Kavitha Deeksha : ఢిల్లీలో క‌ల్వ‌కుంట్ల క‌విత దీక్ష

సాయంత్రం దాకా ధ‌ర్నా

MLC Kavitha Deeksha : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు కోసం ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత(MLC Kavitha) ఢిల్లీలో దీక్ష‌కు దిగారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. భార‌త జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈ దీక్ష కొన‌సాగుతోంది. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీనిని ప్రారంభించారు. ముందుగా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర్వ‌హించేందుకు ఢిల్లీ పోలీసుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతుండ‌గానే పోలీసులు ఎంట‌ర్ అయ్యారు. జంత‌ర్ మంత‌ర్ కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఖంగు తిన్నారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆ త‌ర్వాత తేరుకుని ఆమెనే స్వ‌యంగా ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ తో సంభాషించారు. చివ‌ర‌కు స‌గం స్థ‌లం మాత్ర‌మే ఇచ్చేందుకు ఆస్కారం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎందుకంటే ఇత‌ర పార్టీలు కూడా ఇక్కేడ ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేస్తున్నాయ‌ని దీంతో ప‌ర్మిష‌న్ ఇచ్చేందుకు ఇబ్బందిక‌రంగా మారింద‌ని వెల్ల‌డించారు. క‌ల్వ‌కుంట్ల క‌విత చేప‌ట్టిన దీక్ష‌కు దేశంలోని 18 పార్టీలు సంఘీభావం ప్ర‌క‌టించాయి. సీపీఎం నాయ‌కుడు సీతారాం ఏచూరి ఎమ్మెల్సీ క‌విత దీక్ష‌ను ప్రారంభించ‌నున్నారు. సీపీఐ కార్య‌ద‌ర్శి డి. రాజా క‌విత దీక్ష‌ను(MLC Kavitha Deeksha)  విర‌మింప చేస్తారు.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమెకు త‌మ ముందు హాజ‌రు కావాల‌ని ఈడీ నోటీసులు జారీ చేసింది. దీక్ష పేరుతో వాయిదా వేసింది. మార్చి 11న తాను వ‌స్తాన‌ని క‌విత పేర్కొంది. విచార‌ణ చేప‌డ‌తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : వ‌రాల జ‌ల్లు జేబుల‌కు చిల్లు

Leave A Reply

Your Email Id will not be published!