Vedant Patel : వేదాంత ప‌టేల్ కు అరుదైన గౌర‌వం

విదేశాంగ ప్ర‌తినిధిగా యుఎస్ నియామ‌కం

Vedant Patel USA : అమెరికాలో ప్ర‌వాస భార‌తీయుల హ‌వా కొన‌సాగుతోంది. బైడెన్ స‌ర్కార్ కొలువు తీరిన త‌ర్వాత ఎన్నారైలు కీల‌క‌మైన పోస్టుల‌లో నియ‌మింప‌బ‌డ్డారు. తాజాగా మ‌రో ఎన్నారైకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. యుఎస్ విదేశాంగ శాఖ ప్ర‌తినిధిగా వేదంత ప‌టేల్(Vedant Patel USA)  నియ‌మితుల‌య్యారు. ఆయ‌నను తాత్కాలికంగా నియ‌మిస్తున్న‌ట్లు యుఎస్ స‌ర్కార్ వెల్ల‌డించింది.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే పోస్టులో ఉన్న నెడ్ ప్రైజ్ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. దీంతో విదేశాంగ శాఖ ప్ర‌తినిధి పోస్టు ఖాళీ అయ్యింది. ఈ పోస్టు ఆ దేశానికి అత్యంత కీల‌కం. అందుక‌నే బైడెన్ ప్ర‌భుత్వం వెంట‌నే నిర్ణ‌యం తీసుకుంది. వేదాంత ప‌టేల్ కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఇక వేదాంత ప‌టేల్ యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ లో తాత్కాలిక ప్ర‌తినిధిగా సేవ‌లు అందించ‌నున్నారు. మ‌రో కొత్త వ్య‌క్తిని శాశ్వ‌త ప్ర‌తినిధిగా నియ‌మించేంత వ‌ర‌కు పేటేల్ కొన‌సాగుతార‌ని అమెరికా దేశ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని అమెరికా స‌ర్కార్ త‌ర‌పున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ వెల్ల‌డించారు.

ఇక నెడ్ ప్రైజ్ 2021 జ‌న‌వ‌రి 20న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దేశానికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌లో ముఖ్య పాత్ర పోషించారు. ఇక వేదాంత ప‌టేల్(Vedant Patel USA)  స్వ‌స్థ‌లం ఇండియా. ఇక్క‌డ పుట్టిన ఆయ‌న అమెరికాలోని కాలిఫోర్నియాలో పెరిగారు.

వేదాంత ప‌టేల్ జోసెఫ్ బైడెన్ కు గ‌తంలో అసిస్టెంట్ ప్రెస్ సెక్ర‌ట‌రీగా ప‌ని చేశారు. మీడియా సంబంధాల‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకే ఆయ‌న‌కు ఈ ఛాన్స్ ల‌భించింది.

Also Read : వి’ హ‌బ్ నిర్మాణంలో దీప్తి కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!