MLC Kavitha : హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ కామెం్టస్ చేశారు. తనపై లేని పోని అవాకులు చెవాకులు పేలడం మంచి పద్దతి కాదన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. సభ్యత, సంస్కారం మరిచి పోయి నోరు పారేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
MLC Kavitha Comment
తాను లిక్కర్ క్వీన్ ను కానని తాను అందరు కొలిచే, ఆరాధించే బతుకమ్మ లాంటి దానినని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడటం దారుణమన్నారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha). నేను మీ నాయకురాలు ఇటలీ రాణిని కాదంటూ ఎద్దేవా చేశారు. తాను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదంటూ మండిపడ్డారు.
మీరు మరింత దిగజారి పోయి బతుకమ్మను కూడా అవమానించారని, ఏ సంస్కృతి, ఏ నాగరికత మీకు నేర్పిందో ఒక్కసారి ఆలోచించు కోవాలని సూచించారు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టుడు ఖాయమని జోష్యం చెప్పారు. ప్రతి ఒక్కరు గులాబీ జెండాను కోరుకుంటున్నారని , తాము ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వస్తామన్నారు ఎమ్మెల్సీ.
Also Read : Congress Win : తెలంగాణలో హస్తం హవా