MLC Kavitha : కేంద్రంపై యుద్దం ‘జన జాగృతి’ పోరాటం
కేంద్రం, బీజేపీ కావాలని వేధిస్తోంది
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆమెను డిసెంబర్ 11న ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల దాకా విచారణ చేపట్టింది. ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చింది సీబీఐ మరో నోటీసు ఇచ్చింది.
అనంతరం కల్వకుంట్ల కవిత నేరుగా ప్రగతి భవన్ లో తన తండ్రి కేసీఆర్ తో భేటీ అయ్యింది. ఇవాళ తెలంగాణ జాగృతి సంస్థ కీలక సమావేశం హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. కేంద్రం, బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశ వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని కానీ వాటిని పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.
ప్రతి రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు, రైతులు, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, బుద్ది జీవులు, సామాజికవేత్తలు, జర్నలిస్టులను ఏకంగా చేస్తానని అన్నారు కల్వకుంట్ల కవిత. ఇదిలా ఉండగా కావాలని కేంద్రం టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించారు. నరేంద్ర మోదీ పీఎంగా కొలువు తీరాక ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చారంటూ మండిపడ్డారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులతో హోరెత్తిస్తున్నాయని కానీ వారి వాళ్లను టార్గెట్ చేయడం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని నిప్పులు వస్తాయని హెచ్చరించారు. ఇక యుద్దం చేస్తామన్నారు కవిత(MLC Kavitha).
ఫోర్త్ ఎస్టేట్ ప్రైవేట్ ఎస్టేట్ గా మారిందని ధ్వజమెత్తారు కవిత.
Also Read : బీఆర్ఎస్ కోసం సీఎం హస్తినకు పయనం