MLC Kavitha : అడ్డుకున్నా అభివృద్ది ఆగ‌లేదు

మోదీపై నిప్పులు చెరిగిన క‌విత

MLC Kavitha : కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించ‌క పోయినా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది ఆగ లేద‌న్నారు ఎమ్మెల్సీ క‌విత‌(MLC Kavitha). శ‌నివారం శాస‌న మండ‌లిలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. అభివృద్దిలో త‌మ రాష్ట్రం ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు.

మాన‌వ‌తా దృక్ప‌థం, దార్శ‌నిక‌త‌, రాజ‌నీత‌జ్ఞ‌త , కార్య‌దీక్ష క‌లిగిన నాయ‌కుడు సీఎంగా ఉన్నందు వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పారు క‌విత‌. కేంద్రం కావాల‌ని స‌పోర్ట్ చేయ‌లేదు. మ‌రో వైపు ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాయి..కేసులు వేశాయి.. ఇంకా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నార‌ని ఆరోపించారు ఎమ్మెల్సీ.

ఇవాళ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , వ్య‌వ‌సాయ రంగాల‌లో టాప్ లోకి తెలంగాణ చేరింద‌న్నారు క‌విత‌(MLC Kavitha). పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ రాష్ట్రాన్ని సంద‌ర్శించి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌శంసించార‌ని చెప్పారు. త‌మ రాష్ట్రాల‌లో ఇలాంటి ప‌థ‌కాన్ని తాము కూడా అమ‌లు చేస్తామ‌ని త‌మ‌కు చెప్పార‌ని తెలిపారు ఎమ్మెల్సీ క‌విత‌. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చేలా కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్న ఘ‌న‌త త‌మ స‌ర్కార్ దేన‌ని పేర్కొన్నారు.

2022 నాటికి త‌ల‌స‌రి ఆదాయం రూ. 3,17,118 కు పెరిగింద‌న్నారు. విద్యా, వైద్యం, వ్య‌వ‌సాయం , ఉద్యోగ‌, ఉపాధి క‌ల్ప‌న‌, పెన్ష‌న్లు ఇవ్వ‌డంలో టాప్ లో ఉన్నామ‌ని తెలిపారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, అడ‌వుల పెంప‌కం, ఆల‌యాల అభివృద్ది, ద‌ళిత , మైనార్టీల‌, బీసీల , అగ్ర‌వర్ణాల అభివృద్ది పై ఫోక‌స్ పెట్టామ‌న్నారు క‌విత‌.

Also Read : మోదీ పాల‌న‌లో దేశం వెనక‌కు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!