MLC Kavitha ED : ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక ఆరోపణలు
Today MLC Kavitha ED : ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 20న సోమవారం హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమె తన సోదరుడు, మంత్రి కేటీఆర్ తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు ఇప్పటికే.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారణకు ఆదేశించారు. సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడిని కూడా అరెస్ట్ చేసింది.
ఇదే కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) విచారించింది సీబీఐ. అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసు జారీ చేసింది. మార్చి 11న ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వెళ్లిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాత్రి 8.05 నిమిషాలకు తిరిగి వచ్చారు. మొదట లోపలికి వెళ్లినప్పుడు పిడికిలి బిగించింది. తిరిగి వచ్చినప్పుడు నవ్వుతూ బయటకు వచ్చారు. ఇదే సమయంలో ఈడీ మార్చి 16న రావాలని నోటీసు ఇచ్చింది.
కానీ అనూహ్యంగా తాను రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చింది కల్వకుంట్ల కవిత. న్యాయవాది సామ భరత్ ద్వారా నోటీసు ఈడీకి ఇచ్చారు. అంతకు ముందు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తనను టార్చర్ కు గురి చేశారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఈడీ విచారణ చేపట్టకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశించింది. ఈ తరుణంలో 20న హాజరు కావాల్సిందేనంటూ ఈడీ(Today MLC Kavitha ED) మరో నోటీసు ఇచ్చింది.
Also Read : అందరి చూపు కల్వకుంట్ల కవిత వైపు