MLC Kavitha : ‘కొత్త’ కుటుంబానికి క‌విత ప‌రామ‌ర్శ

ప్ర‌భాక‌ర్ రెడ్డి భార్య‌కు భ‌రోసా

MLC Kavitha : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన ఎంపీ, ప్ర‌స్తుతం దుబ్బాక అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌త్తి పోటుకు గుర‌య్యారు.

MLC Kavitha Meet Kotta Prabhakar Family

దీంతో ర‌క్త స్రావం కావ‌డంతో హుటా హుటిన హైద‌రాబాద్ లోని య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రులు త‌న్నీరు హ‌రీశ్ రావు, కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

ఈ దాడిలో కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి అంగ‌ర‌క్ష‌కుడికి కూడా గాయ‌మైంది. ఈ సంద‌ర్బంగా కేసీఆర్ ఆయ‌న‌ను అభినందించారు. మెరుగైన వైద్య ప‌రీక్ష‌లు చేయాల‌ని యశోద ఆస్ప‌త్రి యాజ‌మాన్యాన్ని ఆదేశించారు కేసీఆర్.

ఇదిలా ఉండగా లండ‌న్ లో ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో ప్ర‌సంగించిన అనంత‌రం తిరిగి హైద‌రాబాద్ కు వ‌చ్చారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌(MLC Kavitha). ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి భార్య‌ను ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు ఎమ్మెల్సీ.

రాజ‌కీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Also Read : Arvind Kejriwal : ఈడీ విచార‌ణ‌కు కేజ్రీవాల్ డుమ్మా

Leave A Reply

Your Email Id will not be published!