MLC Kavitha CM KCR : ఈడీ కథేంటి..డాడితో డాటర్ భేటీ
ప్రగతి భవన్ లో కేసీఆర్ తో కవిత
MLC Kavitha CM KCR : ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రధానంగా తెలంగాణ సీఎం , భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పేరు మరోసారి తెర మీదకు రావడం కలకలం రేపింది. అమిత్ అరోరా అరెస్ట్ తర్వాత సీబీఐ సమర్పించిన ఛార్జ్ షీట్ లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెల్లడయ్యాయి.
11 ఫోన్లను ధ్వంసం చేసిందని వెల్లడించింది. ఈ సందర్బంగా ఈనెల 11న కవిత నివాసంలో సీబీఐ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. 41 పీఆర్సీ కింద నోటీసు జారీ చేసింది సీబీఐ. దీనిపై లైట్ తీసుకున్నారు కవిత. అంతకు ముందు ఆమె కేంద్రంపై, భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు.
ఆడబిడ్డలు కళ్లల్ల నీళ్లు పెట్టుకోరని నిప్పులు కురిపిస్తారంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో ఊహించని విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ మనీ లాండరింగ్ కు సంబంధించి ఇండో స్పిరిట్ ఎండీ రిమాండ్ రిపోర్టు ను 268 పేజీలతో కోర్టుకు సమర్పించింది. మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేసింది.
అంతే కాదు సౌత్ గ్రూప్ కు 65 శాతం వాటా ఉంటే ఒక్క కవితకు 32 శాతం ఉందంటూ వెల్లడించింది. దీంతో నేడో రేపో విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ క్షణంలోనైనా ఈడీ తలుపులు తట్టే ఛాన్స్ ఉండడంతో సమాలోచనలు జరిపేందుకు ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు.
న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మరోసారి ఈడీ బాంబు పేల్చింది.
Also Read : లాభాల బాట పట్టిన ఆర్టీసీ