MLC Kavitha Case : మరోసారి శుక్రవారానికి వాయిదా పడ్డ ఎమ్మెల్యే కవిత లిక్కర్ కేసు
దీంతో రౌస్ అవెన్యూ కోర్టు వచ్చే గురువారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది...
MLC Kavitha : మద్యం పాలసీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రౌస్ అవెన్యూ కోర్టులో వాయిదా పడింది. ఈ కేసులో విచారణ ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. జూన్ 7న సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించగా.. సీబీఐ రీఫైల్ చేసిన చార్జిషీట్లోనూ తప్పులున్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
MLC Kavitha Liquor Case
దీంతో రౌస్ అవెన్యూ కోర్టు వచ్చే గురువారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మద్యం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి నాలుగు నెలలు కావస్తున్నా బెయిల్ లభించలేదు. అప్పటి నుండి అనేక ప్రయత్నాలు జరిగాయి మరియు ఇప్పుడు బెయిల్ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది.
Also Read : AP Free Sand : ఏపీ ఉచిత ఇసుక పాలసీకి జిఓ ఇచ్చిన సర్కారు