Patnam Mahender Reddy : పొర‌పాటున అలా అన్నానంతే – ప‌ట్నం

ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి కామెంట్

Patnam Mahender Reddy  : తాండూరులో కారు రాజకీయం సీఐ వేదిక‌గా మ‌రింత వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. చివ‌ర‌కు పార్టీకి ఇబ్బంది క‌లిగించేదిగా ఉండ‌డంతో గ్ర‌హించిన మంత్రి కేటీఆర్ ఈ మేర‌కు స‌ద్దుమ‌ణిగేలా చేశారు.

ఈ మేర‌కు సీఐని దూషించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి(Patnam Mahender Reddy )స్పందించారు. తాను కావాల‌ని అన‌లేద‌ని, పొర‌పొటున నోరు జారాన‌ని చెప్పారు.

త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల పోలీసులు బాధ ప‌డితే క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లు తెలిపారు. తాను సీఐ రాజేంద‌ర్ రెడ్డిని క‌లుస్తాన‌ని అన్నారు.

ఇదిలా ఉండ‌గా రౌడీషీట‌ర్ల‌కు కార్పెట్ వేస్తావా..ఎంత ధైర్యం నీకు అంతు చూస్తానంటూ సీఐపై ఎమ్మెల్సీ ప‌ట్నం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఆడియో లీక్ కావ‌డం. సోష‌ల్ మీడియాను షేక్ చేయ‌డం జ‌రిగింది.

దీంతో ప‌రిస్థితి చేయి దాటి పోతుంద‌ని గ్ర‌హించిన పార్టీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరుకు తాత్కాలికంగా తెర దించింది.

ఈ గొడ‌వ‌కు ప్ర‌ధాన కార‌ణం ఇటీవ‌ల జ‌రిగిన భావిగి భ‌ద్రేశ్వ‌ర జాత‌ర‌. ముందుగా ఎమ్మెల్సీ హాజ‌ర‌య్యారు. అర‌గంట త‌ర్వాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ‌చ్చారు.

మ‌రో కార్పెట్ వేసి ఆయ‌న‌ను కూర్చో బెట్టారు. ఇదే ర‌చ్చ‌కు కార‌ణ‌మైంది. ప్రోటోకాల్ ఎందుకు పాటించ లేదంటూ సీఐ రాజేంద‌ర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

త‌న ముందే రౌడీ షీట‌ర్ల‌కు కార్పెట్ ఎలా వేస్తావంటూ ఫైర్ అయ్యారు. అన‌రాని మాట‌లు అన్నారు. దీంతో నొచ్చుకున్న సీఐ ఇబ్బంది ప‌డ్డారు. ఎమ్మెల్సీపై కేసు కూడా న‌మోదు చేశారు.

దీనిపై ఎస్పీ విచార‌ణ‌కు ఆదేశించారు. మ‌రో ట్విస్ట్ ఏమిటంటే ఎమ్మెల్సీ ప‌ట్నంపై మ‌రో కేసు న‌మోదైంది. యాలాల ఎస్సై కూడా ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

Also Read : దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాలి

Leave A Reply

Your Email Id will not be published!