MLC Vijaya Shanthi: ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబానికి బెదిరింపులు !
ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబానికి బెదిరింపులు !
MLC Vijaya Shanthi : కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను చంపేస్తానంటూ బెదిరింపులు రావడం తెలంగాణా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో విజయశాంతి(MLC Vijaya Shanthi) దంపతులకు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాండిల్ చేసిన చంద్రకిరణ్‌రెడ్డి అనే వ్యక్తి ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపించాడు. దీనితో ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
MLC Vijaya Shanthi Family Got Threatening Calls
4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి తమను సంప్రదించి, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి(MLC Vijaya Shanthi) వద్ద సోషల్‌మీడియా హ్యాండ్లర్‌గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు వివరించారు. అయితే చంద్రకిరణ్ రెడ్డి మాతో కలిసి పనిచేస్తూ తన సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నారు. స్వలాభం కోసం మా పేరును వాడుకున్నారు. అతని పనితీరు నచ్చకపోవడంతో చంద్రకిరణ్ సేవలను వినియోగించుకోలేదు. మేం బీజేపీలో ఉన్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడింది. ఆ పార్టీలో ఎదిగేందుకు చంద్రకిరణ్ మమ్మల్ని వాడుకున్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాక అతడి నుంచి మెసేజ్ వచ్చింది. పెండింగ్ లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా అని అందులో ఉంది. ఈక్రమంలో మావద్ద బకాయిలు ఏమీ లేవని సమాధానమిచ్చాం.
ఈ క్రమంలో ఏప్రిల్ 6న … తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాసప్రసాద్ కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు. ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా… చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో శ్రీనివాస్ ప్రసాద్ ఆశ్చర్యపోయారు. దీనితో, తన ఆఫీసుకు వచ్చి… దీనిపై మాట్లాడాలని శ్రీనివాస్ సూచించారు. కానీ, చంద్రకిరణ్… ఆఫీసుకు రాకపోగా… మెయిల్స్, మెసేజ్‌లతో బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే.. విజయశాంతి, శ్రీనివాస్‌ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే, వారి కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమోదయోగ్యం కాని రీతిలో సందేశాలు ఉన్నాయి. చంద్రకిరణ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’’ అని శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి దంపతులు.. అతడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు బంజారాహిల్స్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
Also Read : TGPSC: బీఆర్‌ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు