KTR Modi : మోదీ నిర్వాకం వల్లే దేశం నాశనం – కేటీఆర్
నోట్ల రద్దుకు ఆరు సంవత్సరాలు పూర్తి
KTR Modi : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పాలిట శాపంగా మారిందన్నారు(KTR Modi). 2016లో నోట్లు రద్దు చేసిన ప్రధాని చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిందన్నారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు నిర్ణయం తప్పు అని దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రధానమంత్రిని.
దేశంలో వ్యాపారవేత్తలు, కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరిచిన ఘనత ఒక్క నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. బ్లాక్ మనీని తీసుకు వస్తామన్నారు. జన్ ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు కేటీఆర్. నోట్ల రద్దు వల్ల ఉన్న డబ్బులు రాక పోగా బ్లాక్ మనీ మరింత పెరిగిందన్నారు.
నకిలీ కరెన్సీ అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారంటూ ధ్వజమెత్తారు. డిజిటల్ ఎకానమీ చేస్తామంటూ ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. నోట్ల రద్దు తర్వాత 2017 జనవరి నాటికి దేశంలో రూ. 17.97 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉంటే ప్రస్తుతం ప్రజల వద్ద రూ. 30.88 లక్షల కోట్ల నగదు ఉందన్నారు. అదనంగా రూ. 12.91 లక్షల కోట్ల నగదు చలామణిలోకి వచ్చిందని పేర్కొన్నారు కేటీఆర్.
Also Read : కోమటిరెడ్డి ఓ కోవర్ట్ – స్రవంతి రెడ్డి